Home జాతీయ వార్తలు ప్రేమికుల రోజు.. సెలవు ప్రకటించిన యూనివర్సిటీ

ప్రేమికుల రోజు.. సెలవు ప్రకటించిన యూనివర్సిటీ

Lucknow-University

లక్నో: ప్రేమికుల రోజు సందర్భంగా బుధవారం విద్యార్థులెవరూ క్యాంపస్‌లోకి రావొద్దంటూ లక్నో యూనివర్సిటీ నోటీసులు జారీచేసింది. వాలంటైన్స్ డేతో పాటు మహాశివరాత్రి సందర్భంగా రేపు యూనివర్సటీకి సెలవు ప్రకటించామని ఈ నేపథ్యంలో విద్యార్థులేవరూ క్లాసుల్లోగానీ, క్యాంపస్ పరిసరాల్లో కానీ కనిపించొద్దని అధికారులు నోటీసులు అంటించారు. గతంలో ప్రేమికుల రోజు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వర్సిటీ అధికారి వినోద్ సింగ్ గుర్తు చేశారు. ఈ కారణంతోనే రేపు ఎలాంటి తరగతులుకానీ, సాంస్కృతిక కార్యక్రమాలుకానీ నిర్వహించలేదనే విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని సహకరించాలని వినోద్ సింగ్ కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.

Lucknow University issues advisory to students to not to come on Valentine’s Day.