Home తాజా వార్తలు త్రిషకు లక్కీ ఆఫర్

త్రిషకు లక్కీ ఆఫర్

Lucky Offer To Trisha in Rajani Kanth Movie

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది త్రిష. కానీ ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు రావడం లేదు. అయితే కన్నడంలో చేసిన తొలి సినిమాతోనే  ఆమె బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు త్రిష చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించడం లేదు. ఇక్కడ వెంకటేష్, బాలయ్య వంటి సీనియర్ హీరోలు కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వడం లేదు. 15 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగించిన త్రిషకు తెలుగులో అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే తమిళంలో మాత్రం ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ బ్యూటీ ఐదు సినిమాలు చేస్తోంది. 96,  గర్జనై, శతురంగ వెట్టై 2, 1818, పరమపదం విళయాట్టు చిత్రాల్లో ఆమె నటిస్తోంది. వీటికి తోడు సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఓ లక్కీ ఆఫర్‌ను అందుకుంది త్రిష. రజనీ నటించే 162వ సినిమాలో ఈ భామను హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హార్రర్ బేస్డ్ సినిమా ఇది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖి, విజయ్ సేతుపతి, బాబీ సింహా, మేఘా ఆకాష్, సిమ్రాన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.