Home ఖమ్మం భోజనపాట్లు..బడిబయటే వంటలు

భోజనపాట్లు..బడిబయటే వంటలు

2kothagudem01ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ విషయంలో గత కొన్నేళ్లుగా వసతులు వేధిస్తున్నాయి. మధ్యాహ్న భోజన వర్కర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు గురికావల్సి వస్తుంది. పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన నిర్మాహకులు తప్పేదిలేక అప్పులు చేసి వంటలు చేస్తూ అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా గ్యాస్ సరఫరా ఈ మధ్యాహ్న భోజన పథకానికి చేయకపోవడంతో విద్యార్థులకు భోజనాలను కట్టెలపైనే వంటలు చేయాల్సి వస్తుంది. దీంతో అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు నిర్వాహకులకు కట్టెలపొగతో కష్టాలు తప్పడంలేదు. జిల్లాలో దాదాపు 50 శాతం వరకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై పర్యవేక్షణ కరవైంది. చిన్నపాటి వర్షపు జట్టుపడితే ఆ రోజు వంటకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాఠశాలల్లో వంట గదులులేక పాఠశాల ప్రాంగణంలో కొన్ని చోట్లు, ఇళ్లలో మరికొన్ని చోట్లు ఆరుబయట వంట చేయాల్సిన దుస్థితి నెలకొంది. భోజనం కోసం బియ్యం, వంట సామాగ్రీ, పప్పులు,గుడ్లు, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో అరకొర నిధులతోనే వంట చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పలు పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం అనంతరం తాగేందుకు, ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు నీటి సదుపాయం లేక వీధుల్లోని బోర్ల వద్దకు విద్యార్థులు వెళ్లాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. చాలిచాలని జీతాలతో పనిచేయాల్సి వస్తుందని అటు మధ్యాహ్న భోజన వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.