Home జాతీయ వార్తలు డిఎంకె అధ్యక్షుడిగా స్టాలిన్

డిఎంకె అధ్యక్షుడిగా స్టాలిన్

M K Stalin elected president of DMK

చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) అధ్యక్షుడిగా ఎంకె స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పార్టీ కోశాధికారిగా దురైమురుగన్ ను ఎన్నుకున్నారు. స్టాలిన్ ఎన్నికను పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. 50 ఏళ్ల తర్వాత డిఎంకెలో అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. 70 ఏళ్ల డిఎంకె చరిత్రలో మూడో అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్‌గా స్టాలిన్ ఎన్నికవ్వడంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో డిఎంకెకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.