Home తాజా వార్తలు నరేష్ ఆ యాడ్ డబ్బులు ఏం చేశావ్: శివాజీరాజా

నరేష్ ఆ యాడ్ డబ్బులు ఏం చేశావ్: శివాజీరాజా

MAA Elections

 

 

హైదరాబాద్: ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్‌పై ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా విమర్శలు గుప్పించారు. మా లో రోజురోజుకు వివాదాలు పెరుగుతున్నాయి. డైరీ యాడ్స్‌లో రూ.14.2 లక్షలు వాణిజ్య ప్రకటనలు ద్వారా వచ్చాయని, ఏడు లక్షల రూపాయల లెక్కలు చూపించారని, మరో రూ.7.2 లక్షలు నరేష్ మాయం చేశాడని ధ్వజమెత్తారు. ఏడు లక్షల రూపాయలు ఎక్కడ మాయం చేశారని నరేష్‌ను ప్రశ్నించారు. లెక్కలు చెప్పిన తరువాత మా అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణ స్వీకారం చేయాలని రాజా డిమాండ్ చేశారు. గతంలో మా అసోసియేషన్ తరుఫున మలేషియాకు వెళ్లినప్పుడు నరేష్ లగ్జరీ రూమ్‌లో బస చేశారని, తాను, పరుచూరి మాత్రం సాధారణ రూమ్‌లలో బస చేశామని చెప్పుకొచ్చారు. నరేష్ బాగా తాగడంతో విమానం ఎక్కలేకపోయాడని, మరో ఫ్లైట్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఎన్నికలలో హీరో రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మార్చి-22న వీళ్లు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.

 

MAA Elections: Shivajai Raja Comments on Naresh

 

MAA Elections: Shivajai Raja Comments on Naresh