Home తాజా వార్తలు ప్రశాంతంగా ‘మా’ ఎన్నికలు…

ప్రశాంతంగా ‘మా’ ఎన్నికలు…

Maa-Elections

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందులో సుమారు 800 వరకు ఓటు హక్కును కలిగి ఉన్నారు. ‘మా’ సభ్యులైన నటీనటులంతా ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో శివాజీరాజా, సీనియర్ నటుడు నరేష్ పోటీపడుతున్నారు. మా ఎన్నికలతో ఫిల్మ్‌నగర్‌ సందడిగా మారింది. చిరంజీవి, నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అలీ, కృష్ణ భగవాన్‌, సాయికిరణ్‌, దాసరి అరుణ్‌కుమార్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

MAA President Election 2019