Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పిచ్చికుక్కల దాడి : బాలుడు మృతి

BOY

విజయనగరం : పిచ్చికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన బలిజిపేట మండలం హంపావల్లి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన రాగాల జశ్వంత్ (9) తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లి తిరిగొస్తుండగా దేశతల్లి ఆలయం వద్ద పిచ్చికుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన జశ్వంత్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జశ్వంత్ చనిపోయాడు. జశ్వంత్ మూడో తరగతి చదువుతున్నాడు. జశ్వంత్ మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

 Mad Dogs Attack: Boy died

Comments

comments