Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం

Madhukar-Murder

మంథని : దేశ వ్యాప్తంగా సంచలనం రేపి న మంథని మధుకర్ అనుమానాస్పద మృతి కేసులో ప్రధా న ఘట్టమైన మృతదేహానికి సోమవారం రీ పోస్టుమార్టం నిర్వ హిం చారు. హైకోర్టు ఆదేశాలనుసారం ఉస్మానియా, కాకతీయ మెడికల్ కళాశాల నుంచి వచ్చిన ఇద్దరు ఫోరెనిక్స్ నిపుణులు జిల్లా సబ్ ఛీప్ మేజిస్ట్రేట్, మధుకర్ తల్లిదండ్రుల సమక్షంలో విడియోగ్రాఫి ద్వారా సోమవారం ఉదయం 11.20 గంటల నుంచి రీ పోస్టుమార్టం కోసం మధుకర్ శవం పాతి పెట్టిన స్ధలంలో బొంద తోడే క్రమంలో చుట్టూ వరి పొలం ఉండటం నీరు ఉబికి రావడంతో కొంత ఆలస్యమైంది.

11.20 గంటలకు ప్రారంభమైన రీ పోస్టుమార్టం మధ్యాహ్నం ఇ. 20 గంటల వరకు సుమారు ఐదు గంటల పాటు నిర్విరామంగా కొన సాగింది. దీనికి సంబంధించిన రిపోర్టు నివేదికను సిల్డ్‌కవర్‌లో వారం రోజుల్లోగా హైకోర్టుకు అందిస్తామని ఫొరనిక్స్ వైద్యులు తెలిపారు. కాగా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేస్తున్న సమ యంలో కుటుంబ సభ్యులతో పాటు ఎంఆర్‌పిస్, దళిత, ప్రజా, విద్యార్ధి సంఘాల నాయకులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోగె రాజరాం, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, శాతవాహన యూనివర్సిటీ ఫ్రొఫెసర్ సూర్‌పల్లి సుజాత, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్ధ రాష్ట్ర కమీటి సభ్యుడు చొప్పరి మోహన్, పౌర హక్కుల సంఘం నాయకుడు బాలకిషన్, ఆదివాసుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్, కుల నిర్మూలన పోరాట సమితి హైదరాబాద్ జిల్లా కన్వీనర్ నయనాల సతీష్, ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌ఎస్, ఎంఎంఎస్ నాయకులు మాతంగి ఓదెలు, కన్నూరి ఓదెమ్మ, రేణకుంట్ల సాగర్, జూల చంద్ర శేఖర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోరే గణేష్, ఎఐఎస్‌ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బాలసాని లెనిన్‌లతో పాటు పిడిఎస్, డిఎస్‌యూ విద్యార్ధి సంఘాల నాయకులు తరలివచ్చిన వారిలో ఉన్నారు. పోస్టుమార్టం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Comments

comments