Search
Sunday 23 September 2018
  • :
  • :

మధుకర్ మృతిపై రీ పోస్టుమార్టంకు సిద్దం !

Murder-of-Madhukar

మంథని : మంథని మధుకర్ కుటుంబసభ్యులు కోరితే మధుకర్ శవానికి రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు తా ము సిద్దంగా ఉన్నామని, అయితే సిపికి గానీ, తమ కు గానీ, ఎసిపికి గానీ రీ పోస్టుమార్టం కోసం అతని కుటుం బసభ్యుల నుంచి ఏలాంటి వినతులు రాలేద న్నారు. శనివారం మధ్యాహ్నం మంథని పోలీ సు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. మధుకర్ కుటుంబసభ్యు ల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి క్రింద మంథని ఎస్‌ఐ ఉపేందర్‌రావు కేసు నమోదు చేసు కోని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

మంథని మండలం ఖనాపూర్‌కు చెందిన మంథని మధూకర్ వెంకటపూ ర్‌కు చెందిన శీరిష అనే యువతిని ప్రేమించడం జరిగిందని తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నార ని, అయితే సదురు యువతి సైతం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించ గా, ప్రస్తు తం చికిత్స పోందుతున్నదని, ఆమె పూర్తిగా కోలుకో ని వివరాలు తెలిపితే ఈ కేసుకు సంబంధించి అస లు నిజాలు బయటపడుతాయన్నారు. కేసును విచా రణ జరిపించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

మంథని మధుకర్ మృతిపై పెద్దపల్లి డిసిపి విచారణ..!

Police

మంథని మండలం ఖా నాపూర్ గ్రామానికి చెందిన మంథని మధూకర్ మా ర్చి 14వ తేదీన అనుమానా స్పద స్థితిలో ఖానాపూర్ శివారులోని ముళ్లపోదలో శవమై కనబడగా, అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మంథని పోలీ సులు అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. కాగా మధుకర్ మృతి కేసుపై శనివారం మధ్యాహ్నం పెద్దపల్లి డిసిపి విజేయంద ర్‌రెడ్డి, మంచిర్యాల డిసిపి జాన్ వెస్లి, గోదావరిఖని ఎసిపి అపూర్వ రావులు విచారణ చేపట్టారు. మధుకర్ శవం లభ్య మైన ఖానాపూర్ శివారులోని ముళ్లపోదల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఖానాపూర్‌కు వెళ్లి మధు కర్ మృతికి సంబంధించిన విషయాలను అతని అన్నయ్య చిరంజీవితో పాటు గ్రామస్ధులను అడిగి తెలుసుకున్నారు.

చిన్న గోడవ పడితేనే వచ్చి గోడవ పడిన వారిని కోట్టుకోంటూ తీసుకుపోయే పోలీసు లు మధుకర్ మృతి చెంది పక్షం రోజులు దాటిన తర్వాత విచారణకు రావడ మేంటని మధుకర్ కుటుంబ సభ్యులు, గ్రామస్ధులు ప్రశ్నించారు. మంథని ఎస్‌ఐ, సిఐలు హత్య నిందు తులకు కోమ్ము కాస్తున్నారని, మధూకర్ శవానికి రీ పోస్టుమార్టం నిర్వహించి నిజానిజాలు బయటపెట్ట డంతో పాటు వేరే పోలీసులకు ఈ కేసు విచారణను అప్పగించాలని వారు పోలీసు ఉన్నతాధికారుల ఎదుట డిమాండ్ చేశారు. వెంట మంథని సిఐ ప్ర భాకర్, ఎస్‌ఐ ఉపేందర్‌రావు లాల్‌లు ఉన్నారు. సమావేశంలో మంచిర్యాల డిసిపి జాన్ వెస్లి, గోదావరిఖని ఎసిపి అపూర్వరావులు పాల్గొన్నారు.

Comments

comments