Home తాజా వార్తలు నాకు కరణ్‌జోహార్ ఇన్‌స్పిరేషన్

నాకు కరణ్‌జోహార్ ఇన్‌స్పిరేషన్

 

యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్‌బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందిన ఎంటర్‌టైనర్ ‘ఎబిసిడి’. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ మధుర శ్రీధర్ రెడ్డి చెప్పిన విశేషాలు…
సరైన ప్రాజెక్ట్…
ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ కాన్సెప్ట్ బేస్డ్‌గా రూపొందినవే. అయితే సోషల్ మీడియా, పాలిటిక్స్‌ను టచ్ చేస్తూ కొత్తదనంతో కూడిన సినిమా చేయాలనుకుంటున్న సమయంలో నాకు ‘ఏబిసిడి’ సరైన ప్రాజెక్ట్‌గా అనిపించింది.
ఆనందంగా ఉంది…
సినిమాకు మంచి స్పందన వస్తున్నందుకు ఆనందంగా ఉంది. అల్లు శిరీష్ కెరీర్‌లో ఓ హిట్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. సినిమాకు కలెక్షన్లు బాగా వస్తున్నాయి.
దర్శకత్వానికి కొంత బ్రేక్…
గతంలో నేను దర్శకత్వం వహించిన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ తర్వాత నేను డైరెక్ట్ చేయడానికి మంచి సబ్జెక్ట్ దొరకలేదు. దీంతో దర్శకుడిగా మరో చిత్రాన్ని తెరకెక్కించలేదు. ప్రస్తుతం దర్శకత్వానికి కొత్త బ్రేక్ ఇచ్చి సినిమాల నిర్మాణంపైనే దృష్టిపెట్టాను.
కరణ్‌జోహార్ నాకు ఇన్‌స్పిరేషన్…
నిర్మాతగా నాకు ఇన్‌స్పిరేషన్ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్‌జోహార్. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేసి ఆతర్వాత నిర్మాతగా ఆయన సినిమాలను రూపొందిస్తారు. ఆయనలాగే నేను కూడా ముందుకు వెళ్తూ ఫిల్మ్‌మేకర్‌గా కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్నాను.
తదుపరి చిత్రం…
నా నెక్స్ సినిమా ‘దొరసాని’ జూలై 5న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వారం రోజుల్లో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం.

 Madhura Srider Special interview