Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

స్పీకర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Speaker Madhusudhana Chary addressing at Telangana Formation Day Celebrations

జయశంకర్ భూపాల్‌పల్లి: శనివారం స్పీకర్ మధుసూదనాచారి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన పల్లెబాటలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన గణపురం నుంచి భూపాలపల్లికి వెళ్తుండగా గణపురం శివారులో మధుసూదనాచారి ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. గణపురం పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు పరిశీలించి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులతో కలిసి నాగలి పట్టి దుక్కిదున్నారు.

Comments

comments