Home తాజా వార్తలు పెట్రోధరలపై వ్యాట్ తగ్గించిన మధ్యప్రదేశ్

పెట్రోధరలపై వ్యాట్ తగ్గించిన మధ్యప్రదేశ్

Petrol

భోపాల్: పెట్రోల్, డీజీల్‌ ధరలపై వ్యాట్ ను తగ్గించాల్సిందిగా కేంద్రం చేసిన సూచనలకు మధ్యప్రదేశ్ సర్కార్ సానుకూలంగా స్పందించింది. పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. పెట్రోల్ పై ౩శాతం, డిజిల్‌పై 5శాతం వ్యాట్‌ను తగ్గించిన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విషయమై ఒకసారి ఆలోచించాలని కేంద్రం చేసిన సూచనల మేరకు ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం పెట్రోధరలపై వ్యాట్ ను తగ్గించిన విషయం తెలిసిందే.