Home జాతీయ వార్తలు విటుడి వేషంలో పోలీస్.. సెక్స్ రాకెట్ గుట్టురట్టు…

విటుడి వేషంలో పోలీస్.. సెక్స్ రాకెట్ గుట్టురట్టు…

Madhya pradesh: Police bust the sex racket then rescue minor girls

భోపాల్: అచ్చం సినిమాను తలపించేలా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం  నిర్వహిస్తున్న ముఠా ఆటకట్టించాడో పోలీస్ అధికారి. మధ్యప్రదేశ్ లోని పాన్పూర్ ప్రాంతంలో సెక్స్ రాకెట్ ముఠా ఆటను కట్టించేందుకు ఓ పోలీసు అధికారి విటుడి వేషంలో వెళ్లారు. అనంతరం తనకు ఓ అమ్మాయి కావాలని చెప్పి, వ్యభిచారం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి సెక్స్ రాకెట్ ను బట్టబయలు చేశారు. మైనర్ బాలికలు, యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. దీంతో పక్క సమాచారం మేరకు ఓ పోలీస్ అధికారి సదరు ముఠా ఆటకట్టించేందుకు విటుడి రూపంలో రంగంలోకి దిగారు. పాన్పూర్ లోని వ్యభిచారం జరుగుతున్న ప్రాంతానికి అధికారి మఫ్టీలో వెళ్లారు. అక్కడ ఆయన కొందరిని వేశ్యాగృహాల గురించి వాకాబు చేశారు. దీంతో కొందరు మధ్యవర్తులు పోలీస్ అధికారిని వేశ్యాగృహానికి తీసుకెళ్లారు. అంతకుముందే ఆ ప్రాంతానికి దగ్గరలోనే మకాం వేసిన పోలీసులు.. అధికారి సమాచారంతో వెంటనే వేశ్యాగృహాలపై దాడి చేశారు. ఈ సోదాల్లో ముగ్గురు మైనర్ బాలికలు, ఏడుగురు యువతులతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మైనర్ బాలికలు, ఏడుగురు యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించారు. నిర్వాహకులపై పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీస్ అధికారి తెలిపారు.