Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జయలలిత ‘కొడుకు’ను అరెస్టు చేయండి !

Madras-Court

చెన్నై: తమిళనాడు మాజీ  ముఖ్యమంత్రి జయలలితకు కొడుకునంటూ నకిలీ పత్రాలు సృష్టించడమేకాక, కోర్టును కూడా మోసగించేందుకు పూనుకున్న జె. కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు సోమవారం ఆదేశించింది. సెంట్రల్ క్రైమ్  బ్రాంచ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీల్డ్ కవర్‌లో ఇచ్చిన రిపోర్టు  ఆధారంగా న్యాయమూర్తి ఆర్. మహదేవన్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

ఈరోడ్‌కు చెందిన కృష్ణమూర్తి, వసంతమణి కుమారుడే తప్ప జయలలిత కుమారుడు కాడని, అతడు చెప్పుకుంటున్నదంతా అబద్ధమని ఆ రిపోర్టులో ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. అతడు పాత స్టాంప్ పేపర్లు కొని నకిలీ పత్రాలు సృష్టించాడని కూడా పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన కోర్టు న్యాయమూర్తిని అతడిని అరెస్టు చేయాలని, తదుపరి విచారణను ఏప్రిల్ 10న చేపడతామని ఆదేశించారు.

కోర్టు మార్చి 17న కృష్ణమూర్తిని పత్రాలు అసలైనవేనా అని ప్రశ్నించడమేకాక మందలించింది. ‘ఇతడిని నేను తలచుకుంటే నేరుగా జైలుకు పంపగలను. కానీ ఇప్పుడు పోలీస్ అధికారులు అతడిని జైలు తీసుకెళ్ళాల్సిందిగా ఆదేశిస్తున్నాను’ అని జడ్జి మహదేవన్ అన్నారు.

Comments

comments