Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మళ్లీ థియేటర్ లోకి ‘మగధీర’..?

maghadeera

హైదరాబాద్: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘మగధీర’ బాక్సాపీస్ వద్ద రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ బాక్సాపీస్ ను షేక్ చేస్తూ తెలుగు సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి, దేవ్‌గిల్ లు కీలక పాత్రల్లో నటించారు. జపాన్‌లో ఇండియన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  అప్పట్లో మగధీర సినిమా జపాన్‌లో సబ్‌టైటిల్స్‌తో విడుదలైంది. అయితే మరోసారి ఈ సినిమా జపాన్ థియేటర్లలో సందడి చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మగధీర విడుదలైన సమయంలో ఎస్‌ఎస్ రాజమౌళికి జపాన్‌లో క్రేజ్ తక్కువే. అయితే బాహుబలి విడుదలైన తర్వాత ఒక్కసారిగా జక్కన్న పేరు ఇంటర్నేషనల్ గా  మార్మోగిపోయింది. ఈ  నేపథ్యంలో
రాజమౌళి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మగధీర సినిమాను మళ్లీ జపాన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. అయితే దీనికి సంబంధించి చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఆసక్తికర వార్తపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే మరి.

Comments

comments