Search
Monday 24 September 2018
  • :
  • :

మ్యాగీ నూడుల్స్ కేసు విచారణ పూర్తి

maggieముంబయి : నెస్లే ఇండియా మ్యాగీ నూడుల్స్‌లో ప్రమాణాలకు మించి సీసం మోతాదు కలిగి ఉందంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నివేదికను వ్యతిరేకిస్తూ నెస్లే ఇండియా వేసిన పిటి షన్‌పై ముంబయి హైకోర్టులో వాదోపవాదాలు ముగిసాయి. హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు కోర్టు నెస్లే తరఫు న్యాయవాది రాజేష్ భాత్రా శుక్రవారం రాత్రి ఆలస్యంగా ఓ ప్రకటన విడుదల చేశారు. నెస్లే కంపెనీ ప్రఖ్యాత మ్యాగీ నూడుల్స్ నమూనాలలో ఎక్కువ సీసం ఉందని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ మే నెలలో ప్రకటించింది. దాంతో నెస్లే కంపెనీ భారతదేశంలోని అన్ని దుకాణాల నుండి మ్యాగీ నూడుల్స్‌ను వెనుకకు రప్పించింది. ప్రభుత్వ నివేదికలను వ్యతిరేకిస్తూ బొంబయి హైకో ర్టులో నెస్లే పిటిషన్ దాఖలు చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ, నెస్లే ఇండియాలు మ్యాగీ నూడుల్స్‌ను పునః పరీక్షించాలని ఆదేశించిందని శుక్రవారం నెస్లే తరఫు న్యాయవాది టివిలో ప్రకటించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ న్యాయవాది అందుబాటులో లేరు.
త్వరలో మ్యాగీ అమ్మకాలు ప్రారంభం
నెస్లే ఇండియా మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను త్వరలో పునః ప్రారంభిస్తా మని నెస్లే ఇండియా అధ్యక్షుడు సురేశ్ నారాయణ వెల్లడించారు. మ్యాగీ నూడుల్స్‌లో ప్రమాణాలకు మించి సీసం మోతాదు కలిగి ఉందంటూ భా రత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నిషేదించడం పై భారత్‌లో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. భారత్‌లో వ్యాపారాన్ని తిరి గి మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని సురేశ్ తెలిపారు. మ్యాగీ తయారీ పై తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. సోమ వారం బొంబయి హైకోర్టు తన తీర్పును వెల్లడించే అవకాశాలు ఉన్నాయన్నారు.

Comments

comments