Home ఖమ్మం కోర్టులోనే గుండెపోటుతో మేజిస్ట్రేట్ హఠాన్మరణం

కోర్టులోనే గుండెపోటుతో మేజిస్ట్రేట్ హఠాన్మరణం

భద్రాచలంలో విషాదం
HEARTATTACKమన తెలంగాణ / భద్రాచలం : భద్రాచలం సెకెండ్ క్లాస్ మేజిస్ట్రే ట్ సిహెచ్ సంజీవరావు గురువా రం విధి నిర్వహణలో ఉండగా గుండె పోటుతో మృతి చెందారు. వివరాల ప్రకారం సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సంజీవరావు ఎప్పటి మాదిరిగానే సోమవారం విధుల్లోకి వచ్చారు. సీటులో కూర్చుండగానే అసౌకర్యంగా ఉండటంతో మరుగు దొడ్లోకి వెళ్లారు. ఇబ్బంది ఎక్కువ కావడంతో తనకు ఏదో అవుతున్న దని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని అక్కడున్న వారిని కోరారు. వారు హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. గుండె పోటు రావడంతో మృత్యువాత పడ్డారని తెలిపారు. ఈయన స్వ గ్రామం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం లోని రామన్నపాలెం. సంజీవరావు మృతి పట్ల ప్ర థమ శ్రేణి నాయమూర్తి బుల్లికృష్ణ, పట్టణ ఎస్సై మురళీ, బార్ అసోసియేషన్ సభ్యులు వసంతరావు, శ్రీనివాసప్రసా ద్‌తోపాటు పలువురు సంతాపం తెలిపి నివాళు లర్పించారు.