Home తాజా వార్తలు ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం

 Magnitude 6.4 earthquake strikes Indonesia

జకార్తా: ఇండోనేషియాలోని ఆదివారం  ఉదయం 6.47 గంటలకు  భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.4గా నమోదైందని భూ పరిశోధనా అధికారులు వెల్లడించారు.  భూకంపం కారణంగా పది మంది వ్యక్తులు చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గాయపడిన వారి  సంఖ్య 100పైగా ఉండొచ్చిన ప్రభుత్వాధికారులు పేర్కొన్నారు.  భూకంపం రావడంతో లోమ్‌బోక్ దీవి వణికిపోయింది.  భూకంపం ధాటికి దీవిలోని పలు ప్రాంతాల్లో భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.