Home అంతర్జాతీయ వార్తలు పిఎంఒ శల్య సారథ్యంలోనే అవినీతిపై యుద్ధం

పిఎంఒ శల్య సారథ్యంలోనే అవినీతిపై యుద్ధం

రామన్ మెగసెసె అవార్డు
anshu-gupta_Sanjeev_manatelangana copyఈ అవార్డును 1957లో ఏర్పాటు చేశారు. ఇది ఆసియాలో అత్యంత ప్రతిష్టాకరమైన బహుమతి. దీనిని ఈ ఖండం నోబెల్‌గా కూడా అభివర్ణిస్తారు. ఫిలిప్పీన్స్‌కు మూడో అధ్యక్షుడిగా ఉన్న రామన్ మెగసెసె పేరు మీద ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఇచ్చే ఈ బహుమతికి నిస్వార్థ సేవకు అంకితమైన వ్యక్తులను, సంస్థలను ఎంపిక చేస్తారు. ఇప్పటి వరకు మొత్తం 307 మంది ఈ బహుమతిని పొందారు.

దాతృత్వ సంస్కృతికి ఊతమిచ్చిన అన్షూ గుప్తా
అన్షూ గుప్తా సామాజిక కార్యకర్త. ఆయన ఢి ల్లీ కేంద్రంగా పనిచేసే ‘గూంజ్’ అనే స్వచ్ఛం ద సంస్థను నడిపిస్తారు. ఈ సంస్థ పడవేసిన పాత దుస్తులను, గృహోపయోగ వస్తువులను సేకరించి పేదలకు ఉపయోగ పడే వస్తువు లుగా మలుస్తుంది. గుప్తా ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. గూంజ్‌ను ఏర్పాటు చేయక ముందు, ఆయన కొద్ది కాలం కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేశా రు. ఈ అవార్డు గెల్చుకున్న తర్వాత మాట్లాడుతూ గుప్తా, ‘గూంజ్ వేలాది మంది మద్దతును గెల్చుకుంది. అయితే ప్రజల ఆలోచనాతీరును మార్చే పోరాటం ఇంకా మిగిలే ఉంది. భారతదేశంలో దాతృత్వ సంస్కృతి తక్కు వ. తమ ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న వస్తువుల్ని ఇచ్చేలా ధనికుల్ని ప్రేరే పించడం, ఉచితంగా పొందాలని చూడకుండా తమ అవసరాల కోసం కష్ట పడాలని పేదల్ని ఒప్పించడం రెండూ కష్టమైనవే’ అని అన్నారు. ప్ర స్తుతం గూంజ్ 21 రాష్ట్రాలలో పని చేస్తుంది. యేటా ఇది 1000 టన్నుల వాడిన దుస్తులను, గృహోపయోగ వస్తువులను, ఇతర వస్తువులను నగరాల నుంచి సేకరించి గ్రామాలకు తరలించి ప్రజలకు అందిస్తుంది.

ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు ఈసారి ఇద్దరు యువ భారతీయు లను వరించింది. అవినీతికి వ్యతిరేకంగా శంఖం పూరించిన ఐఎఫ్‌ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది, పేదల కోసం పనిచేసే ఎన్‌జీవో ‘గూంజ్’ వ్యవ స్థాపకుడు అన్షూ గుప్తా ఈ బహుమతికి ఎంపికయ్యారు. వీరితో పాటు లావో స్, ఫిలిప్పీన్స్, మయన్మార్ దేశాలకు చెందిన మరో ముగ్గురికి కూడా ఈ బ హుమతి దక్కింది. రామన్ మెగసెసె అవార్డును ఆసియా నోబెల్‌గా భావిస్తా రు. ఇప్పటి వరకు ఈ అవార్డును 47 మంది భారతీయులు అందుకున్నారు. ఇటీవలి సంత్సరాల్లో దీనిని పొందిన వారిలో అరుణా రాయ్, సందీప్ పాండే, అరవింద్ కేజ్రీవాల్, పాలగుమ్మి సాయినాథ్ తదితరులున్నారు. సంజీవ్ చతుర్వేదిని ‘ఎమర్జెంట్ లీడర్‌షిప్’ శ్రేణిలో ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గత ఆగస్టులో ఆయనను ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారి పదవి నుంచి తప్పించా రు. అంతకు ముందు హర్యానాలో ఆయన వేధింపులు ఎదుర్కొన్నారు. అవి నీతిని బైట పెట్టడమే తప్పయిందని ఆయన వాపోయారు. అన్షూ గుప్తా 1999లో తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి గూంజ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. భారతదేశంలో దాతృత్వ సంస్కృతిలో మార్పు తేవడానికి గుప్తా కృషి చేశారని ఫౌండేషన్ పేర్కొంది. పేదలకు బట్టలు, తదితర గృహపయోగ వస్తు సామగ్రిని అందించడం ‘గూంజ్’ ప్రత్యేకత.

వేధింపుల మధ్యే అవినీతితో పోరాడుతున్న సంజీవ్ చతుర్వేది
రామన్ మెగసెసె అవార్డు గెల్చుకున్న సంజీవ్ చతుర్వేది (40) హర్యానాకు కేడర్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. 1995లో అలహాబాద్ ఎన్‌ఐటి నుంచి ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందారు. ఐఎఫ్‌ఎస్ శిక్షణ సందర్భంగా ఆయనకు ఉత్తమ విద్యార్థి బహుమతి లభిం చింది. 2002లో ఐఎఫ్‌ఎస్ ఫలితాల్లో ఆయ నకు రెండో ర్యాంకు లభించింది. సేవాకాలంలో మెగసెసె అవార్డు పొందిన రెండో అధికారి ఆయన. అంతకు ముం దు కిరణ్ బేదీకి ఈ ఘనత దక్కింది. ఈ యువ అధికారికి నిజాయితీపరుడని, నిక్కచ్చిగా వ్యవహరించే వాడని పేరుంది. సంజీవ్ 2007-08లో ఝజ్జర్‌లో ఒక హెర్బల్ పార్కు నిర్మాణంలో జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. ఈ కుంభకోణంలో మంత్రి, ఎంఎల్‌ఎ సహా కొందరు అధికారుల పేర్లు బైటపడ్డాయి. హిస్సార్, ఝజ్జర్ జిల్లాలలో ప్లాంటేషన్ ప్రాజెక్టులలో జరిగిన అవినీతిపై ఆయన గళమెత్తారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆయన వరుసగా పలు కుంభకోణాల్ని బైటికి తీశారు. హర్యానాలో పని చేసే సమయంలో ఆయనను 12 సార్లు బదిలీ చేశారు. ఎన్నో ఆరోపణలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఆయనపై క్రిమిన ల్ కేసులు కూడా నమోదయ్యాయి. 2009లో అటవీ శాఖకు చెందిన ఒక అధికారి చనిపోగా, సంజీవ్ చేసిన ఒత్తిళ్ల వల్లనే అతడు చనిపోయాడని ఆరోపించారు. అయితే, ఆ తర్వాత ఆయనకు క్లీన్ చిట్ లభించింది.
ఆ తర్వాత, ఆయన హర్యానా ప్రభుత్వంతో వి సుగు చెంది తనను డిప్యూటేషన్‌పై పంపించాలని కేంద్రాన్ని వేడుకున్నారు. తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అప్పటి రాష్ట్ర పతి ప్రతి భా పాటిల్‌కు మొరపెట్టుకున్నారు. ఆయన కేసు ను ఆమె క్యాబినెట్ సెక్రటేరియట్‌కు పంపించా రు. కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రి త్వశాఖ 2010లో నిర్వహించిన విచారణలో చతుర్వేది చేసి న ఆరో పణలు నిజమని తేలాయి. కేసును సిబిఐకి నివేదిం చారు. చివరకు ఆయనపై పెట్టిన కేసుల్ని రద్దు చేశా రు. 2012లో ఆయనను ఢిల్లీలోని ప్రఖ్యాత ఆసు పత్రి ఎయిమ్స్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. ఆ పద విలో ఉంటూనే ఆయన విజిలెన్స్ అధికారిగా కూడా కొనసాగారు. నియమాలకు వ్యతిరేకంగా విదేశీ ప్రయాణాలు చేస్తున్న డాక్టర్లపై ఆయన చర్యలు తీసు కున్నారు. ఆయన ఫిర్యాదుపై పోలీసులు ఆసుపత్రి ఆవరణలో ఒక వ్యాన్ లోంచి రూ. 6 కోట్ల విలువ చేసే నిషేధిత మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారిగా చతుర్వేది పనితీరును ప్రశంసిస్తూ, అప్పటి ఆరో గ్యశాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ విజిలెన్స్ అంతర్గత నివేదికలపై రెండు సార్లు సంతకం చేశారు. ఆయన దాదాపు 200 అవినీతి కేసుల్ని పట్టుకున్నా రు. వాటిలో 78 కేసుల్లో దోషులకు శిక్ష పడింది. 87 కేసుల్లో చార్జ్‌షీట్ జారీ చేశారు. దాదాపు 20 కేసులను నేరవిచారణ కోసం సిబిఐకి నివేదించారు. అయితే, 2014లో ఆయనను నిఘా బాధ్యతల నుంచి తొలగించారు. ఈ నిర్ణయం వివాదమైంది. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా తనను టార్గెట్ చేశారని సంజీవ్ ఆరోపణ. సంజీవ్‌కు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలు, ఎఐఐఎంఎస్ ఉద్యోగులు ముందుకు వచ్చారు. కేజ్రీవాల్ ఆయనకు ఢిల్లీ ఎసిబి పగ్గాలు అప్పగించాలని ఆశించారని సమాచారం.
అవార్డు గెల్చుకున్న తర్వాత సంజీవ్ చతుర్వేది మోడీ ప్రభుత్వం పట్ల తన అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చారు. ‘ప్రధాని కార్యాలయం పనివి ధానం నన్ను బాగా నిరాశకు గురిచేసింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని కఠిన విధానాన్ని ప్రకటించారు. తాను తినననీ, పరులను తిననివ్వననీ అన్నారు. నే ను కూడా అవినీతిని ఏ మాత్రం సహించగూడదనే విధానంతోనే పని చేశాను. కానీ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించడానికి బదులుగా పదవిలోంచి తప్పించా రు’ అని ఆయనన్నారు. హర్యానాలో, ఎయిమ్స్‌లో వేళ్లూనుకున్న అవినీతి పట్ల ప్రధాని కార్యాలయం సీరియస్‌గా లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అవినీతిపై పోరాడుతున్న తన లాంటి అధికారికి పిఎంఒ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయనన్నారు.