Search
Tuesday 17 July 2018
  • :
  • :

ప్లాస్టిక్ వాడకంపై కొరడా

 Mahabubabad Municipality  Ban  Use Plastic  Covers

మన తెలంగాణ/మహబూబాబాద్ : పర్యావరణం పరిరక్షణలో భాగంగా నగరంలో ప్లాస్టిక్ వాడకంపై మున్సిపల్, పోలీస్ సంయుక్తంగా దాడులు నిర్వహించి విక్రయదారులు, వినియోగదారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కల్కెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు. ఈ మేరకు పర్యావరణ జిల్లా నోడల్ అధికారిగా డిఎఫ్‌ఓ కిష్టగౌడ్ వ్యవహరిస్తారని కలెక్టర్ చెప్పారు. మహబూబాబాద్‌ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భావితరాలకు పర్యావరణంతో పెద్ద ఎత్తున ముప్పు ఏర్పడుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ప్లాస్టిక్ వాడకం నిషేధించాల్సిన అవసరం ఉంది. వాతారణం కాలుష్యానికి గురికాకుండా సకాలంలో వర్షాలు పడాలంటే ప్లాస్టిక్ వాడకం నిషేదించాలని, అందుకు అధికారులతోపాటు మహబూబాబాద్ జిల్లా ప్రజలు కూడా సహకరించి ప్లాస్టిక్ వాడకం నిషేధించాలన్నారు. ప్లాస్టిక్ విక్రయదారులపై మున్సిపల్ శాఖ, పోలీసులు దాడులు నిర్వహించి కేసులు పెట్టాలని ప్లాస్టిక్ విక్రయాన్ని పూర్తిగా నిషేధించి మహబూబాబాద్‌ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులను కోరారు.

Comments

comments