Home కుమ్రం భీం ఆసిఫాబాద్ సామూహిక వివాహాలతో మహాగాం ఆదర్శం

సామూహిక వివాహాలతో మహాగాం ఆదర్శం

Group-Marriagesసిర్పూర్ : ప్రతి యేటా మహాగాం కమిటి, గురుదేవ సేవ మండలి ఆధ్వర్యంలో సామూహిక వివాహలు నిర్వహించడం ఏజెన్సీకి ఆదర్శమని ఆసిఫాబాద్ ఎంఎల్‌ఎ కోవలక్ష్మి అన్నారు. సిర్పూర్ (యు) మండలం మహాగాంలో శనివారం నాలుగు సామూహిక వివాహలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గ్రామాభివృద్ధి కమిటీ అన్ని ఖ ర్చులను భరీంచడం అనవాయితీగా వస్తుంది. వధు వుకు తాళిబొట్టుతో సహా సామూహిక భోజనాలు చే పట్టడం అనవాయితీగా వస్తుండగా శనివారం జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైయ్యారు. ఈ సందర్భంగా నవజంటలకు పెండ్లి బట్టలను బహుకరించి అనంతరం మాట్లాడుతూ మండలంలోని మహాగాం ఇప్పటికే ఆదర్శంగా నిలిచిందని మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ గిరిజన ప్రాంతంలోనే ప్రత్యేక పేరును సంపాందించుకుందన్నారు.

అందరు మద్యం, మాంసాహారానికి దూరమై గ్రా మంలోఅభివృద్ధి ,ప్రశాంతమైన వాతవరణానికి మూ లకారణమైయిందన్నారు. సూరోజి బాబా ఆశీ స్సులతో ఆయన మార్గంలో నడువడం గ్రామస్దుల అ దృష్టమన్నారు.ఈ వివాహలు ప్రతియేటా నిర్వహించ డంతో పాటు అన్ని ఖర్చులు భర్తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వచ్చే ఏడాది శివరాత్రి సం దర్భంగా నిర్వహించే కార్యక్రమానికి తమ తరపున భోజనాలు ఖర్చు భరీస్తామన్నారు. గ్రామాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్ర మంలో ఎంపిపి అంబుబాయ్,పోలాజీ, మాజీ ఎం పిపి ఆత్రం భగవంత్‌రావు,సిఐ రవికుమార్,ఎస్సైతో పాటు నేట్నూర్ సర్పంచ్ నాగరావు,మాదం సర్పంచ్ ఆత్రం పద్మరాజేశ్వరి,కనుక సుదర్శన్,కైలాస్,సీతా రాం,గురుదేవ్ దేవమండలి సంబంధించిన సభ్యు లు,ప్రతినిధులు పాల్గొన్నారు.

మహాదేవ్ ఆలయాభివృద్దికి 20 లక్షలు

మహాదేవ్ ఆలయాభివృద్ధికి రూ.20లక్షలు త్వరలోనే మంజూరు చేయనున్నట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. సిర్పూర్ (యు) శనివారం జాతర ఉత్సవాన్నిపురస్కరించుకొని పురాతన మహదేవ్ ఆ లయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ జాతర కమిటీ సభ్యులు ఎమ్మె ల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ పురాతన శివాలయాభివృద్దికి 20 లక్షలు మంజూరు చేసి అన్ని అభివృద్ధి పనులు చేపడుతామ న్నారు. భక్తుల సౌకర్యార్దం మండపం నిర్మాణంతో పాటు బోర్‌వెల్ ఏర్పాటుకు త్వరలోనే చర్యలు తీ సుకుంటామన్నారు. వచ్చే ఏడాది కల్ల జాతరలో అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మేస్రం అంబుబాయ్ పోలాజీ,స్దానిక సర్పంచ్ ఆత్రం ఓంప్రకాష్,సిఐ రవి కుమార్,ఎస్సై చంద్రశేఖర్,సర్పంచ్ నాగరావు, సుద ర్శన్,ఆలయ కమిటీ చైర్మన్ ఆత్రం సన్మాన్‌రావు క నుక మణిక్‌రావు,ఆత్రం ఆనంద్‌రావు,కొట్నాక పాం డురంగ తదితరులు పాల్గొన్నారు.