Home రాష్ట్ర వార్తలు నేడే మహాఘట్టం

నేడే మహాఘట్టం

cm-kcrముంబయి చేరుకున్న సిఎం కెసిఆర్ బృందం
మంగళవారం 5 చరిత్రాత్మక ఇరిగేషన్ ఒప్పందాలపై మహారాష్ట్రతో సంతకాలు
రాజ్‌భవన్‌లో బస, గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ

 హైదరాబాద్ : తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య నిర్మించ తలపెట్టి న పలు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ముంబయికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలు దేరి 2.20కి ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానా శ్రయంలో దిగారు. సిఎం వెంట నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, దేవాయ శాఖ మంత్రి ఎ.ఇంద్ర కరణ్ రెడ్డి, అటవీ శాఖమంత్రి జోగు రామన్న, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు డి.శ్రీనివాస్, నీటిపారుదల సల హాదారులు విద్యాసాగర్ రావు, ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్ రెడ్డి, నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషి, సిఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి పి.రాజశేఖర్ రెడ్డి, ఇంజినీర్లు వెళ్లారు. మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానం మేరకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో తన బృందంతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. మహా రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ముఖ్య మంత్రి కెసిఆర్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. సిఎం, మంత్రులు, అధికారులకు గవర్నర్ మధ్నాహ్న భోజనం ఏర్పాటు చేసి ఆతిథ్యమిచ్చారు. అనంతరం సిఎం కెసిఆర్ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపే చర్చలు, చేసుకునే ఒప్పందాలపై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఉన్నతాధికారులతో చర్చిం చారు. ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఒప్పం దాలు జరుగుతున్నాయని, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించడంతోనే జఠిలమైన సమస్యలు పరిష్కార మయ్యాయని సిఎం అన్నారు. ఒప్పంద నిబంధనలు మరోసారి పరిశీలించాలని సిఎం సూచించగా, మంగళ వారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.