Search
Sunday 23 September 2018
  • :
  • :

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన ‘మహానటి’

mahanati

‘మహానటి’ ఘన విజయాన్ని పురస్కరించుకొని నిర్మాత అల్లు అరవింద్, స్టార్ హీరో అల్లు అర్జున్ కలిసి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతలు అశ్వనీదత్, ప్రియాంకదత్, స్వప్నదత్‌లను  సత్కరించారు. ఈ కార్యక్రమంలో కీర్తిసురేష్, విజయ్ దేవరకొండతో పాటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి,  ఎస్.ఎస్.రాజమౌళి, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, పరుచూరి గోపాలకృష్ణ, జెమినీ కిరణ్, కె.ఎస్.రామారావు, రమేష్ ప్రసాద్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, బి.వి.యస్.ఎన్.ప్రసాద్, కరుణాకరన్, త్రినాథ్‌రావు నక్కిన తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ “సినీ ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ వస్తాయి. కానీ ఇండస్ట్రీ స్థాయిని పెంచే సక్సెస్‌లు అరుదుగా వస్తుంటాయి. ‘మహానటి’ ఈ కోవకు చెందినదే. ఈ చిత్ర సక్సెస్ క్రెడిట్ అంతా నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్నదత్‌లకే దక్కుతుంది. ఈ చిత్రంలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలున్నాయి”అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ “మహానటి సావిత్రిని తెర మీద ఇంత అద్భుతంగా చూపించి తెలుగు ప్రేక్షకులను పులకరింపచేసిన దర్శకుడు, నిర్మాతలను అభినందించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. కీర్తిసురేష్ సావిత్రిలా అద్భుతంగా నటించింది”అని తెలిపారు. దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “అందరూ ఇంతలా మెచ్చుకుంటుంటే ఈ సినిమా నేను చేసిందేనా అనిపిస్తోంది. ఈ చిత్రం ఇండస్ట్రీ తరపున సావిత్రికి ఇచ్చే నివాళి”అని పేర్కొన్నారు. అశ్వనీదత్ మాట్లాడుతూ “నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు ఎలా చేస్తాడో ఏమిటో అనుకున్నా. కానీ అతను ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంతో ఎంతో ఆనందం కలిగింది. అశ్విన్, ప్రియాంక, స్వప్నల వల్లే ఈ చిత్రం ఘన విజయం సాధించింది”అని తెలిపారు.

Comments

comments