Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అతి శుభ్రతతో బాధపడే శర్వానంద్

Mahanubhavuduశర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘మహానుభావుడు’ ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేశారు. అందాల తార మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్… ఆనంద్ రోల్‌లో నటిస్తున్నాడు. ‘నా పేరు ఆనంద్, నాకు ఓసీడీ ఉంది. అంటే అదేదో బీటెక్ డిగ్రీలాంటిది కాదు. ఓ డిజార్డర్. దీని లక్షణాలు అతి శుభ్రం’ అన్న డైలాగ్ టీజర్‌లో హైలైట్ అయింది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ యువి క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’లో హీరో నాని మతిమరుపు వాడిగా ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం భారీ కలెక్షన్లను వసూలు చేసి నాని కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ‘మహానుభావుడు’లో అతి శుభ్రతతో బాధపడే యువకుడిగా శర్వానంద్‌ను చూపించబోతున్నాడు. ఇక టీజర్‌లో శర్వానంద్‌కు హీరోయిన్ ముద్దివ్వబోతుంటే బ్రష్ చేశావా అనే స్థాయిలో ఉంటుంది అతని పిచ్చి. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ‘మహానుభావుడు’ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు నిర్మాతలు.

Comments

comments