Home తాజా వార్తలు జాయిన్ ‘మహర్షి'(టీజర్)

జాయిన్ ‘మహర్షి'(టీజర్)

Maharshiహైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘మహర్షి’ మూవీ టీజర్ శనివారం ఉదయం విడుదలైంది. మహేష్ మరోసారి స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ”సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవ్.. కామాస్ మాత్రమే ఉంటాయ్.. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ”, ”నాకొక ప్రాబ్లం ఉంది సర్.. ఎవరైనా ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు” అంటూ మహేష్ చెప్పిన డైలాగులు హైలెట్ గా ఉన్నాయి. ప్రిన్స్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉగాది పండగ సందర్భంగా చిత్రయూనిట్ మహేష్ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. టీజర్ చూసిన మహేష్ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పివిసి సినిమా స్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మే 9న మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

Maharshi Teaser is Released