Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

మహాత్ముడి పేరు ఉపయోగించుకోవడం బాధిస్తోంది

గాంధీజి మనవరాలు తారా ఆవేదన
Tara-gandhiన్యూఢిల్లీ: మహాత్మాగాంధీ పేరును స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తనను బాధిస్తోందని గాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాఛార్జీ(82) పేర్కొ న్నారు. శాంతి, సామరస్యం, సంస్కృతి, విద్య అభివృద్ధి చేసిన కృషికి గాను తారా గాంధీకి ఇటీవలే ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆరట్స్ అండ్ లెటర్స్’దక్కింది. రాజకీయ పార్టీలతో పాటూ సామాన్య ప్రజలు కూడా ఆయన పేరును తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారని తెలిపారు. మహాత్మా గాంధీ జాతి పిత. ఆయన గురించి మాట్లాడా లంటే ఆయన అనుసరించి మార్గాలను దృష్టిలో పెట్టు కొని మాట్లాడాలి. సత్యం, కరుణ, ప్రేమలకు గాంధీ ప్రతీక. మీరు ఆయన గురించి మాట్లాడితే వీటన్నింటి గురించి మాట్లాడినట్టే అని తారా గాంధీ అన్నారు. భారత రాజకీయ ముఖచిత్రాన్ని ఎన్నో ఏళ్లుగా చూస్తు న్న వారిలో తారా గాంధీ ఒకరు. అయితే అప్పటికి ఇప్ప టికీ రాజకీయాలలో ఎలాంటి మార్పులు చోటుచేసు కోలేదన్నారు. అధికార దాహంతోనే నాయ కులు ఎప్పు డూ కనబడుతున్నారన్నారు. దాని కోసమే కష్టపడు తున్నారని చెప్పారు. అయితే కొందరు మాత్రమే నిస్వార్థంగా పని చేయాలనుకుంటున్నారని తెలిపారు.

Comments

comments