Home పెద్దపల్లి ‘ఉపాధి’ఫుల్…‘పైసలు’నిల్..!

‘ఉపాధి’ఫుల్…‘పైసలు’నిల్..!

పది నెలలుగా పత్తా లేని ఉపాధి కూలీల వేతనాల చెల్లింపు
పెద్దపల్లి జిల్లాలో పేరుకుపోయిన రూ.9.36 కోట్ల బకాయిలు
ఉపాధి కూలీల ఆకలి కేకలు పట్టని ప్రభుత్వం
అప్పులు తెచ్చుకొని బతుకు బండి లాగిస్తున్న కూలీలు

MGNREGA

మంథని: పేద కూలీలకు స్థానికం గా ఉపాధి చూపించి, వారు వలస బాట పట్టకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత కోన్ని సంవత్సరాలుగా మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆమ లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉపాధి హమీ ప థకం కింద గ్రామాల్లో కూలీలకు పని మాత్రం కల్పి స్తున్నారే తప్ప కూలీలకు మాత్రం సకాలంలో చేసిన పనికి సంబంధించిన వేతనాలు మాత్రం ఇవ్వడం లే దు. పని కల్పించడంలో పెడుతున్న శ్రద్ద వేతనాల చె ల్లింపులో ప్రభుత్వం పెట్టకపోవడంతో ఉపాధి కూలీ లు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.

మే 2016 ను ంచి ఫిబ్రవరి 2017 వరకు 10 నెలలుగా ఉపాధి హా మీ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో పెద్దపల్లి జిల్లాలో 11 మండలాలల్లో రూ. 9.36 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మండలాల వారిగా ఉపాధి కూలీల వేతనాల బకాయిలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మారం మండలంలో రూ. 84.64 లక్షలు, ఏ లిగేడుమండలంలో రూ .47.28, జూలపల్లి మ ండలంలో రూ. 59.93 లక్షలు,కమాన్‌పూర్ మండలంలో రూ. 66. 02 లక్షలు, మంథని మ ండలంలో 107.50 ల క్షలు, మంథని ముత్తారం మండలంలో రూ. 32.16 లక్షలు, ఓదెల మండలంలో రూ.101.79 లక్షలు, పెద్దపల్లి మండలంలో రూ.145.78 లక్షలు, రామ గుండం మండలంలో రూ. 110.73 లక్షలు, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో రూ.93.46 లక్షలు, సు ల్తానాబాద్ మండలంలో రూ. 87.05 లక్షల బ కాయిలు పేరుకుపోయాయి.

నిత్యం వేతనాల కోసం పదుల సంఖ్యలో కూలీలు తమ తమ మండల పరిష త్ కార్యాలయాల చుట్టూ ప్రదీక్షణలు చేస్తున్నారు. పది నెలలుగా చేసిన కూలీ పైకం తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో ఉపాధి కూలీలు దినదినం వడ్డీ వ్యాపారుల వద్ద అధిక మొత్తం వడ్డీకి అప్పు తెచ్చుకోని కుటుం బాలను లాక్కొస్తున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం ఉపాధి కూలీల బకా యిల వేతనాలకు సంబంధించి నిధులు విడుదల చేసి, స దురు కుటుంబాలు రోడ్డున పడకుం డా చూడాల్సిన అవసరం, ఆ వశ్యకత ఎంతైనా ఉంది.