Home జాతీయ వార్తలు ఒడిశా స్కూలులో గాంధీ విగ్రహం ధ్వంసం

ఒడిశా స్కూలులో గాంధీ విగ్రహం ధ్వంసం

Mahatma Gandhi statue
బాలసోర్(ఒడిశా): బాలసోర్  పట్టణం సొవరాంపురం ఏరియాలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు. సిగరెట్ పీకలు, ఖాళీ లిక్కర్ బాటిళ్లు అక్కడ కనిపించాయి.ఆ పాఠశాల ఆవరణలోకి స్థానికులు కొందరు వెళ్లగా ఈ దృశ్యం కంటపడింది. అదే ఆవరణలో నాటిన రెండు చెట్లు కూడా కూలిపోయి ఉన్నాయి. పోలీసులు ఆ ఆవరణ లోకి ప్రవేశించగానే నేల పై గాంధీ తల పడి ఉండడం కనిపించింది. జూన్ 14న ఈ సంఘటన జరిగి ఉంటుందని సహదేవ్‌ఖుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జి శుభ్రాంశు శేఖర్ నాయక్ చెప్పారు. ఇందులో రాజకీయ కోణం ఏదీ లేదని అన్నారు.

Mahatma Gandhi statue destroyed in Govt school in Odisha