Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చంద్రబాబా మజాకా..మహాత్ముడి విగ్రహాన్ని కాల్వలో పడేశారు..

Gandhi-Statue-In-Canalవిజయవాడ : విజయవాడలో ఎపి ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇష్టా రాజ్యంగా ఆలయాలను, విగ్రహాలను కూల్చివేస్తుంది. కొద్ది రోజుల క్రితం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించింన ప్రభుత్వం అఖరికి జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహాన్ని కూడా వదల్లేదు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని అర్థరాత్రి సమయంలో రెవెన్యూ అధికారులు తొలగించారు. దశాబ్దాలుగా గాంధీ విగ్రహం ఆ ప్రాంతంలో ఉంది. దీంతో ఈ విగ్రహాన్ని తొలగించడంపై స్థానికులు తీవ్రంగా నిరసన చేస్తున్నారు. గాంధీ విగ్రహం తొలగింపునకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. స్థానికులు, ప్రజా ప్రతినిధులు అడ్డుచెప్పడంతో అవి సాగలేదు. కానీ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెవెన్యూ అధికారులు మహాత్మ గాంధీ విగ్రహాన్ని తొలగించి.. అ విగ్రహాన్ని బుడమేరు కాల్వలో పడేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాల్వలో ఉన్న విగ్రహం ముక్కను తిరిగి తీసుకొచ్చారు. ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments