Search
Wednesday 14 November 2018
  • :
  • :

మహాత్ముడి అరుదైన చిత్రం వేలం

gandhiవాషింగ్టన్ : మహాత్మా గాంధీ అరుదైన చిత్రాన్ని అమెరికాలో వేలం వేశారు. గాంధీ, మదన్ మోహన్ మాలవీయతో కలిసి నడుస్తున్న ఆ ఫోటో వేలంలో 41,806 డాలర్లు (సుమారు రూ.27లక్షలు) పలికింది. ఆ చిత్రంపై ‘ఎం కె గాంధీ’ అని ఫౌంటెయిన్ పెన్‌తో సంతకం చేసి ఉంది. అది 1931 సెప్టెంబరులో లండన్‌లో రెండో సెషన్ భారత్ రౌండ్ టేండ్ సమావేశం అనంతరం తీసిన ఫొటో అని బోస్టన్‌కు చెందిన ఆర్ ఆర్ వేలం సంస్థ వెల్లడించింది. భారత నేషనల్ కాంగ్రెస్ తరఫున గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. లండన్‌లో 1930 నుంచి1932 మధ్య బ్రిటన్ మూడు సార్లు రౌండ్ టేండ్ సమావేశాలు నిర్వహించింది. గాంధీ ఈ ఫొటోపై సంతకం చేసిన సమయంలో కుడి చేతి బొటనవేలులో నొప్పి తో బాధపడుతున్నారని వేలం సంస్థ తెలిపింది. ఆయన 1931లో ఆగస్టు 8 నుంచి డిసెంబరు 19 వరకు ఎడమ చేతితోనే రాశారని, ఆ సమయంలోనే ఈ ఫొటోపై సంతకం చేసినట్లు పేర్కొంది.

Comments

comments