Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పూర్తిస్థాయి డిజిపిగా మహేందర్ రెడ్డి

dgp

కొత్త చట్టం ప్రకారం నియమించుకున్న రాష్ట్రం
ఫైలుపై సిఎం కెసిఆర్ సంతకం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డిజిపిగా ఎం. మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సోమవారం ఫైలుపై సంతకం చేశారు. గతేడాది నవంబర్ 12 నుంచి మహేందర్‌రెడ్డి ఇన్‌చార్జ్ డిజిపిగా కొనసాగుతున్నారు. తెలంగాణ డిజిపి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన చట్టసభల సమావేశాల్లో ఈ బిల్లుకు అమోదం లభించిం ది. ఈ చట్టం ప్రకారం డిజిపి నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. ఆ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం డిజిపిగా మహేందర్‌రెడ్డి నియమించింది. దీంతో ఇంఛార్జీ డిజిపిగా కొనసాగుతున్న మహేందర్‌రెడ్డి ఇకనుంచి పూర్తిస్థాయి డిజిపిగా కొనసాగనున్నారు.

Comments

comments