Search
Friday 16 November 2018
  • :
  • :

డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ప్రదర్శించిన మహీంద్రా గ్రూప్

Mahendra-Tractors

న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ తొలి డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను మంగళవారం ఢిల్లీ లో ప్రదర్శించింది. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో డెవలప్ చేసిన ఈ ట్రాక్టర్‌ను ప్రదర్శించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఈ వినూత్న ప్రయత్నం వ్యవసాయ రంగంలో ఎంతగానో ఉపయోగపడనుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అన్నారు. అంతర్జాతీయ వ్యవసాయ సమాజానికి ఈ ఉత్పత్తిని అంకితం చేస్తున్నామని అన్నారు. ఆర్ అండ్ డి విభాగం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందని, డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ప్రదర్శించడం మాకెంతో గర్వకారణమని అన్నా రు. వ్యవసాయోత్పత్తులను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు ప్రాధాన్యం పెరిగిందని ఆ సంస్థ వ్యవసాయ పరికరాల తయారీ విభాగం అధ్యక్షుడు రాజేశ్ జెజుర్కిర్ అన్నారు. గతేడాది ‘డిజిసెన్స్’ టెక్నాలజీని ఆవిష్కరించినప్పటికీ ఈ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ దేశీయ రైతాంగానికి ప్రత్యేక ప్రయోజనాలను చేకూరుస్తుందని అన్నారు.  కాగా దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీం ద్రా, డెట్రాయిట్‌కు చెందిన ఫోర్డ్ మోటార్స్‌ల మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. ఈ బాగస్వామ్యం గేమ్ చేంజర్(ప్రస్తుత పరిస్థితిలో గణనీయమైన మార్పు తీసుకొచ్చే)గా మారనుందని నిపుణులు భావిస్తున్నారు.

Comments

comments