Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

తిరునెల్వేలిలో ట్రాక్టర్ తో ధోనీ సందడి..!

Mahendra Singh Dhoni drives Tractor in Tamilnadu's Tirunelveli

చెన్నై: టీమిండియా మాజీ సారథి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తమిళనాడులోని తిరునెల్వేలిలో సందడి చేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టిఎన్‌పిఎల్)లో భాగంగా జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ధోనీ అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా ధోనీ ట్రాక్టర్‌ను కూడా నడపడం విశేషం. మహీ ట్రాక్టర్‌ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోని మైదాన‌ం మొత్తం కలియ తిరుగుతూ అభిమానుల‌కు అభివాదం చేశాడు. టిఎన్‌పిఎల్ లో భాగంగా శనివారం తిరునెల్వేలిలో మధురై పాంథర్స్, కోవై కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కు మహేంద్రుడు టాస్ కూడా వేశాడు. ఇక ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయినా ధోనీ ఇలా అకస్మాత్తుగా స్డేడియంలో ప్రత్యక్షమవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారు తెగ సంబరపడిపోయారు. ఈ సందర్భంగా కెప్టెన్ కూల్ మాట్లాడుతూ వచ్చే ఐపీఎల్ సీజన్‌లోగా తమిళం మాట్లాడటం నేర్చుకుంటానని అభిమానులకు మాటిచ్చాడు. ప్రతి ఏడాది టిఎన్‌పిఎల్‌లో జరిగే కొన్ని మ్యాచ్‌లను వీక్షించేందుకు తప్పకుండా వస్తానన్నాడు. ఒక్కసారిగా మైదానంలో ధోని ప్రత్యక్షమవడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Comments

comments