Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

కోర్టుకెక్కిన ధోనీ

Dhoniన్యూఢిల్లీ : టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బిజినెస్ టుడే పత్రికలో తన ఫొటోను విష్ణువుగా చిత్రీకరిస్తూ వేసిన కవర్ పేజీ ఫొటో విషయంలో తలెత్తిన వివాదాన్ని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఓ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశాడు. 2013లో ధోనీని విష్ణుమూర్తిగా చిత్రీకరించిన ఫోటోను బిజినెస్ టుడే మేగజైన్ ‘ద గాడ్ ఆఫ్ బిగ్ డీల్’ పేరుతో కవర్‌పేజీపై ముద్రించింది. దీంతో హిందు మతాన్ని కించపరిచేలా ఉందని సామాజిక కార్యకర్త జయకుమార్ హిరెమత్ కోర్టు కేసు నమోదచేశారు.  ఈ ఘటనపై ధోనీ అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.అలాగే, బెంగళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దుచేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడంతో ఆ అంశంపై కూడా ధోనీ సుప్రీంకోర్టులో మరో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశాడు.

Comments

comments