Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రైతు బాంధవుడిగా మహేశ్

Mahesh

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న 25వ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘ఊపిరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు పైగానే వేచి చూశాడు. అతని నిరీక్షణ ఫలించి ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రస్తుతం శరవేగంగా సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. డార్జిలింగ్‌లో తొలి షెడ్యూల్ పూర్తికాగానే హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభించారు. రామోజీ ఫిలిం సిటీలో భారీ విలేజ్ సెట్స్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మహేశ్ రైతుగా, రైతు బాంధవుడిగా నటిస్తుండగా… అతని స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక డైలాగ్ కింగ్ సాయికుమార్ రైస్ మిల్ యజమానిగా రక్తికట్టించే పాత్రలో నటిస్తున్నాడు. రైస్‌మిల్ యజమానితో హీరోకు గొడవ జరుగుతుందట. సినిమాలో ఈ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఇక మహేశ్ బర్త్‌డే కానుకగా ఆగస్టు 9న సినిమా ఫస్ట్‌లుక్‌ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఉగాది కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Comments

comments