Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘కాటమరాయుడు’ టీజర్‌లో మహేష్‌బాబు!?

Mahesh In Katamarayudu

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేష్ బాబులకి టాలీవుడ్ మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా అభిమానులకు కొదవలేదు. ఇద్దరిలో ఎవరి చిత్రం విడుదలైన హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం. మరోవైపు తమ హీరో గొప్పంటే, తమ హీరో గొప్ప అని తరుచూ పవన్, మహేష్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో గొడవపడుతుంటారు. ఇంకొంతమంది ఇద్దరు హీరోలను ఒకేసారి వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకొనే వారికి ఈ వార్త నిజంగా గుడ్‌న్యూసే..

పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు టీజర్ విడుదలైన యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తుంది. అతి తక్కువ కాలంలోనే 1లక్ష లైక్‌లు వచ్చిన తెలుగు టీజర్ ఇది రికార్డు సృష్టించింది. అయితే ఈ టీజర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ టీజర్‌లో ట్రైన్ ఫైట్ సీన్ ఒకటి కనిపిస్తుంది. అయితే ఆ ఫైట్‌లో విలన్‌ను తన్నింది మహేష్‌బాబు అని వార్త ప్రస్తుతం దుమారం రేపుతుంది. పవన్, మహేష్ మధ్య ఎప్పటి నుంచి మంచి రిలేషన్‌షిప్ కొనసాగుతోంది. గతంలో అర్జున్ సినిమా పైరసీ సమయంలో మహేష్‌కు పవన్ హెల్ప్ చేశారు. అలాగే త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన జల్సా సినిమాకు మహేష్ వాయిసోవర్ అందించారు. అయితే కాటమరాయుడులో కూడా మహేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌లో మహేస్ తళుక్కుమన్నారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరి నిజంగానే అది మహేష్ బాబా.. లేక కేవలం కొందరు సృష్టించిన పుకారా అనేది తేలాల్సిఉంది.

Comments

comments