Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

శుభ పరిణామం…

Mahesh Babu heaps praises on Geetha Govindam

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఒక పెద్ద హీరో ఒక చిన్న సినిమా గురించి ట్వీట్ చేస్తే దానికి దక్కే ప్రయోజనం చాలానే ఉంటుంది. హీరోలకు మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉంటారు కాబట్టి వాళ్లు ట్వీట్ చేస్తే సినిమా చాలా మందికి చేరుతుంది… మంచి ప్రచారం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈమధ్య సూపర్‌స్టార్ మహేశ్‌బాబు  పలు సినిమాల గురించి ట్వీట్లు చేస్తూ వాటి గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తుండటం విశేషం. ఇటీవల కాలంలో మహేష్ తనకు సంబంధం లేని చాలా సినిమాల గురించి స్పందించాడు. టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘గీత గోవిందం’తో పాటు దానికంటే ముందు వచ్చిన ‘గూఢచారి’ చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశాడు. అంతకుముందు ‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్‌ను కూడా అతను లాంచ్ చేశాడు. విశాల్ డబ్బింగ్ సినిమా ‘అభిమన్యుడు’ గురించి కూడా ట్వీట్ చేశాడు. అయితే మహేశ్‌బాబు తన ఇంట్లో ఈ సినిమాల స్పెషల్ షోలు వేయించుకొని మరీ స్పందించడం విశేషం. ఈ సూపర్‌స్టార్ ట్వీట్లు ఆ సినిమాలకు బాగానే ఉపయోగపడ్డాయి. మహేష్ ఇలా పెద్దన్న పాత్ర పోషిస్తుండటం శుభ పరిణామమే. గతంతో పోలిస్తే ఈ స్టార్ హీరో ఇతర హీరోలను కలిసే విషయంలోనూ మొహమాటాలు వదిలేస్తుండటం విశేషం. అతను తరచుగా ఎన్‌టిఆర్, రామ్‌చరణ్‌లను కలుస్తూ వారితో స్నేహంగా ఉంటున్నాడు.

Comments

comments