Home తాజా వార్తలు ‘సిల్లీఫెలోస్’ ట్రైలర్ విడుదల

‘సిల్లీఫెలోస్’ ట్రైలర్ విడుదల

Mahesh-Babu

సూపర్‌స్టార్ మహేష్‌బాబు చేతుల మీదుగా ‘సిల్లీఫెలోస్’ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినిరాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు భీమినేని శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ఆద్యంతం అలరించే విధంగా తెరకెక్కించారు. ఈ చిత్రంతో సునీల్ కమేడియన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, హేమ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 7న ‘సిల్లీఫెలోస్’ విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః అనీష్ తరుణ్‌కుమార్, సంగీతంః శ్రీవసంత్, ఎడిటర్‌ః గౌతంరాజు, ఆర్ట్‌ః ఎం.కిరణ్‌కుమార్.