Home చిన్న సినిమాలు జిఎస్ టి నోటీసులపై మహేశ్‌బాబు స్పందన

జిఎస్ టి నోటీసులపై మహేశ్‌బాబు స్పందన

Mahesh Babu Response
హైదరాబాద్: జిఎస్‌టి కమిషనరేట్ నుంచి వచ్చిన నోటీసులపై మహేశ్‌బాబు లీగల్ టీమ్ స్పందించింది. 2007-08 ఆర్ధిక సంవత్సరానికి అంబాసిడర్ సర్వీసెస్‌కు పన్ను చెల్లించాలంటూ నోటీసులు అందించారు. వాస్తవానికి అంబాసిడర్ సర్వీసెస్ టాక్స్ పరిధిలోకి రాదని, అంబాసిడర్ సర్వీసెస్‌ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65(105) ద్వారా 01 -07 -2010 నుంచి చేర్చారని మహేశ్‌బాబు లీగల్ టీమ్ తెలిపింది. టాక్స్ పేయర్… చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసులు లేకుండా బ్యాంక్ అకౌంట్ల నిలుపుదలకు జిఎస్‌టి కమిషనరేట్ ఆదేశించారు. మహేష్ బాబు చట్టానికి లోబడే తన పన్నులన్నిటినీ సారిగా చెల్లించారు.
వాస్తవానికి నిన్న జిఎస్ టి కమిషనర్… పన్నులు చెల్లించాలంటూ మహేశ్‌బాబుకు చెందిన యాక్సిక్ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లను స్థంభింప చేశారు. మహేశ్‌బాబు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 43 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకొని, బకాయీ పడిన 73 లక్షల రూపాయల్లో మిగతా మొత్తం రాబట్టుకునేందుకు మహేశ్ బాబుకు నోటీసులు పంపారు.
Mahesh Babu Legal Team Response on GST Notices

Telangana Latest News