Home తాజా వార్తలు థ్యాంక్యూ మై లవ్: మహేష్

థ్యాంక్యూ మై లవ్: మహేష్

Mahesh Babu, Namrata Shirodkar's Passionate Lip Lock is going Viral

టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ ఈ నెల 20న విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే మంచి వసూళ్లు కూడా కొల్లగొడుతోంది. దీంతో ప్రిన్స్ అభిమానలతో పాటు చిత్ర యూనిట్ కూడా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక మహేష్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి వరుస భారీ డిజాస్టర్ల తరువాత వచ్చిన భరత్ బ్లాక్ బస్టర్  కావడంతో మహేష్ ఫుల్ ఖుష్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సక్సెస్‌ని తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. భరత్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టిన అభిమానులకు ఈ సందర్భంగా ప్రిన్స్ ట్విట్టర్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే తన భార్య నమ్రతాకు లిప్‌కిస్ ఇస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘థ్యాంక్యూ మై లవ్’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై అభిమానులు ‘ఎటర్నల్ లవ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.