Home తాజా వార్తలు నెక్ట్స్ మూవీకి సిద్ధమవుతున్న స్క్రిప్ట్

నెక్ట్స్ మూవీకి సిద్ధమవుతున్న స్క్రిప్ట్

Mahesh Babuసూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మే 9న విడుదల కానుంది ఈ చిత్రం. ఆతర్వాత కొంత గ్యాప్ తీసుకొని అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించే సినిమా చేస్తారు మహేష్. ఈ సినిమా బేసిక్ లైన్ బాగా నచ్చడంతో దానికి తగ్గట్టే ఫుల్‌స్క్రిప్ట్‌ను అనిల్ రావిపూడి సిద్ధం చేస్తారన్న గ్యారెంటీ దిల్‌రాజు ఇవ్వడంతో మహేష్ ఈ సినిమాకు ఓకే చెప్పారని తెలిసింది. ఇదిలాఉండగా అనిల్ రావిపూడి ఇప్పటిదాకా తీసిన నాలుగు సినిమాల్లో మహేష్ రేంజ్ స్టార్ హీరోను డీల్ చేయలేదు. సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తున్నందున ఈ దర్శకుడు స్క్రిప్ట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇక మహేష్ సినిమాలో చాలా కమర్షియల్ లెక్కలు ఉంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక దర్శకుడిగా అనిల్ రావిపూడికి పూర్తి స్వేచ్ఛ ఉంది. అతను ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తేనే మహేష్ 26వ సినిమా అంచనాలను అందుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించే ఈ మూవీ షూటింగ్ జూన్‌లో మొదలయ్యే అవకాశాలున్నాయి.

Mahesh Babu Preparation for Next Movie