Home తాజా వార్తలు మోడీ, జగన్ కు మహేశ్ శుభాకాంక్షలు..

మోడీ, జగన్ కు మహేశ్ శుభాకాంక్షలు..

mahesh-and-jaganహైదరాబాద్: ఎపి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసిపి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఇప్పటికే వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపారు. అయితే, తాజాగా ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మీ పాలనలో రాష్ట్రం సరికొత్త ఎత్తుకు చేరుకోవాలని, మీ పదవీకాలం విజయంవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. అదే విదంగా కేంద్రంలో విజయదుందుభి మోగించిన ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు మహేశ్ బాబు. మోడీ పాలనలో భారత్ సుస్థిరతవైపు దూసుకుపోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఎపిలో జరిగిన ఎన్నికల కౌటింగ్ ప్రక్రియలో ప్రారంభం నుంచే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు ముందంజలో కొనసాగారు. దీంతో టిడిపి అభ్యర్థులో వణుకు పుట్టిందని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. వైఎస్ జగన్ గెలుపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తపుంతలు తొక్కబోతోందని ఎపి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Mahesh babu wishes to ys jagan mohan reddy