Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఆ క్రేజీ డైరెక్టర్‌తో 27వ సినిమా

Mahesh

మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న 25వ సినిమా ‘మహర్షి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, రైతు బ్యాక్‌డ్రాప్‌తో ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్ 26వ సినిమా ప్రారంభంకానుంది. ఆ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్టు పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నాడు. తదుపరి మహేష్ నటించే 27వ సినిమా గురించి ఆసక్తికరమైన సమాచారం అందింది. ‘అర్జున్‌రెడ్డి’ ఫేం సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో మహేష్ సిని మా ఉంటుంది. ఈ చిత్రా న్ని గీతా ఆర్ట్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని తెలిసింది. ‘గీత గోవిందం’ అసాధారణ విజయంతో ఖుషీగా ఉన్న అల్లు అరవింద్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే సందీప్‌రెడ్డి వినిపించిన లైన్ మహేష్‌కు ఎంతగానో నచ్చిందని తెలిసింది. రెండో దఫా కథను మహేష్‌కు వినిపించాడట. దీంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని తెలిసింది. 2020లో మహేష్ 27వ సినిమా ప్రారంభం కానుందట. ‘మహర్షి’ సినిమా పూర్తయ్యాక ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.

Comments

comments