Home సినిమా ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌కు మహేష్ సహాయ సహకారాలు

ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌కు మహేష్ సహాయ సహకారాలు

mb

ఆరు సంవత్సరాలుగా మురికివాడల్లో రోజుకి 150కి పైగా రోగుల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్న ఓ ఎన్‌జిఒ సంస్థకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన సహాయ సహకారాలను అందిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఎన్.ఆర్.ఐ. సేవ ఫౌండేషన్ ప్రతినిధులు నమ్రత శిరోద్కర్‌ని కలిసి గత కొన్నేళ్లుగా తాము నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సంస్థ 45 వేల మందికి పైగా రోగులకు ఉచితంగా ఫిజియోథెరపీ వైద్యం అందించింది. వీరిలో 2500 మందికి పైగా పక్షవాతంతో మంచానికే పరిమితమైనవారు ఉన్నారు. ఎన్నో సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కూడా వైద్యం అందించారు. ఎంతో నిబద్ధతతో ఎన్.ఆర్.ఐ. సేవ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురి ంచి నమ్రత ద్వారా తెలుసుకున్న మహేష్‌బాబు ఈ సంస్థకు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో పాటు పేదరికంతో సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న క్రీడాకారుల కోసం ఈ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘స్పోర్ట్ పర్‌ఫార్మెన్స్ అండ్ ఎన్‌హాన్స్‌మెంట్ సెంటర్’కు మహేష్‌బాబు అండగా నిలబడి చేయూతని అందించారు. ఇందులో భాగ ంగా జాతీయ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించే దిశగా అవసరమైన స్పోర్ట్ రీహాబిలిటేషన్, గాయాల బారి నుండి ఎలా కాపాడుకోవాలో అవసరమైన తర్ఫీదు, ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ని గచ్చిబౌలి స్టేడియంలో అందించనున్నారు. మొదటి దశగా స్పోర్ట్ రీహాబిలిటేషన్ సెంటర్‌ను గచ్చీబౌలి స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్.ఆర్.ఐ. సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని మాట్లాడుతూ “మహేష్‌బాబు సహకారంతో మా సంస్థ గ్రామాల్లో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలుగుతోంది. గ్రామాల్లోని మహిళలు, పిల్లలు, వృద్ధులకు సహాయం అందిస్తూ వారితో పాటు స్థానికులను గ్రామాల అభివృద్ధిలో భాగం చేయాలనేది మా లక్షం”అని తెలిపారు.