Search
Sunday 23 September 2018
  • :
  • :

మెరిసిపోతున్న మహేష్

Maheshవంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహేష్‌బాబు 25వ సినిమా ‘మహర్షి’. అల్లరి నరేష్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్. ఇప్పటికే డెహ్రాడూన్‌లో కాలేజ్ సెట్ షెడ్యూల్, హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ముగించుకుంది ఈ చిత్రం. ఇక సోమవారం అమెరికా వెళ్లనున్న సినిమా యూనిట్ అక్కడే దాదాపు నెల రోజుల పాటు మకాం పెట్టనుంది. యుఎస్‌లోని కొన్ని నగరాల్లో పోష్ అర్బన్ కల్చర్ కనిపించేలా రిచ్ లొకేషన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే మహేష్ స్టూడెంట్ లుక్‌తో మోషన్ పిక్చర్‌ను విడుదల చేసింది సినిమా యూనిట్. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మహేష్‌బాబు మెస్మరైజ్ లుక్స్‌తో మెరిసిపోతున్న ఫొటో బయటకు వచ్చింది. మరాఠీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గౌరిక్కర్ ట్విట్టర్ ద్వారా ఈ ఫొటోను రిలీజ్ చేశాడు. సూపర్‌స్టార్‌తో పనిచేయడం ఆనందం కలిగించిందంటూ అతను పెట్టిన పోస్ట్‌ను మహేష్ రీట్వీట్ చేశాడు.

Comments

comments