Search
Monday 24 September 2018
  • :
  • :

అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త పాత్ర

mb

చెప్పినట్టుగానే మహేశ్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించిన పని ప్రారంభించాడు సుకుమార్. మొన్నటివరకు తూర్పు గోదావరి జిల్లాలోని తన స్వగ్రామంలో కొన్ని రోజులు గడిపిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాడు. మహేశ్ ఓకే చెప్పిన స్టోరీలైన్‌పై ఆయన పని ప్రారంభించాడు. ఓ నెల రోజుల్లో ఈ స్టోరీని మహేశ్‌కు వినిపించబోతున్నాడు సుకుమార్. ఇక సుకుమార్ చెప్పిన మూడు స్టోరీ లైన్స్‌లో ఒక లైన్‌కు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రంగస్థలం తరహాలోనే డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో ఉండే ఈ సినిమాకు సంబంధించి ఫుల్ లెంగ్‌త్ స్క్రీన్‌ప్లే రాసే పనిలో సుకుమార్ బిజీ అయ్యా డు. రంగస్థలం సినిమాకు పనిచేసిన రచయితలే ఈ సినిమాకు కూడా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను ప్రారంభించబోతున్నాడు మహేశ్‌బాబు. ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే సుకుమార్‌తో కొత్త సినిమా ప్రారంభమవుతుంది. ఈ గ్యాప్‌లో స్క్రీన్‌ప్లేను ఓ కొలిక్కి తీసుకురాబోతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇప్పటివరకు మహేశ్ పోషించని ఓ సరికొత్త పాత్రను సృష్టించాడట సుకుమార్. రంగస్థలం చిత్రానికి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్న ఈ దర్శకుడు… మహేశ్ మూవీకి మాత్రం అర్బన్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రాబోతోంది.

Comments

comments