Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట

mb

ఇంకా మొదలుకాకుండానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు చేయబోయే సినిమా ఆసక్తి రేపుతోంది. ఈమధ్య బయట కనిపించడం బొత్తిగా మానేసిన మహేశ్ కొత్త లుక్‌ను ‘సమ్మోహనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనులారా చూడవచ్చు. ‘భరత్ అనే నేను’లో ముఖ్యమంత్రిగా మెప్పించి భారీ హిట్ కొట్టిన ఈ సూపర్‌స్టార్ తన కొత్త సినిమాలో మాస్ పాత్రను చేయబోతున్నట్టు తెలిసింది.  ఇందులో మహేష్‌తో పాటు అల్లరి నరేశ్  కూడా నటిస్తాడు. వీళ్లిద్దరూ  కృష్ణుడు, కుచేలుడు పోలిన పాత్రలు చేస్తున్నారట. మరి కృష్ణుడు ఎవరు కుచేలుడు ఎవరు అనే సందేహం రావడం సహజం. మహేశ్ హ్యాండ్‌సమ్‌గా ఉండాడు కాబట్టి కృష్ణుడని నరేశ్  కుచేలుడు పాత్రలో కనిపిస్తాడని అనుకుంటే పొరబడినట్టే. వంశీ ఇక్కడే తెలివిగా కథ రాసుకున్నాడు. మహేశ్ కుచేలుడిగా డబ్బు లేని పాత్ర చేస్తుండగా నరేశ్ డబ్బున్న వాడిగా మహేశ్ ప్రాణ స్నేహితుడిగా నటిస్తాడట. గతంలో ఇలాంటి లైన్‌తో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వంశీ పైడిపల్లి చాలా డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో ఊహకందని మలుపులతో ఈ కథ రాసుకున్నట్టు తెలిసింది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేయనున్నట్టు సమాచారం. ‘ఎవడు’ సినిమా ద్వారా యాక్షన్ సినిమాను ‘బృందావనం’ చిత్రం ద్వారా ఫ్యామిలీ సినిమా… ఇలా  జోనర్ ఏదైనా సులభంగా డీల్ చేయగలను అని నిరూపించుకున్నాడు వంశీ పైడిపల్లి.   మహేశ్ చిత్రాన్ని సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కించేందుకు అతను స్క్రిప్ట్‌ని రాసుకున్నట్టు తెలిసింది.

Comments

comments