Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా?

Mahesh

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం. ఈ సినిమా పూర్తికాగానే ఆయన సుకుమార్ దర్శకత్వంలో తన 26వ చిత్రాన్ని చేస్తారు. ఇక మహేష్ 27వ చిత్రాన్ని గీతా ఆర్ట్ వారు నిర్మిస్తారు. ఈ సినిమాకు సందీప్ వంగాను దర్శకుడిగా అనుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టులో భారీ మార్పు చేసుకోనుందని తెలిసింది. మహేష్ సినిమాకు ఓ అనుభవజ్ఞుడైన దర్శకుడు అవసరమని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారు. అందుకే సందీప్ వంగా స్థానంలో క్రిష్‌ను తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట. క్రిష్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ 27వ సినిమా వర్క్‌ను మొదలుపెడతారని అంటున్నారు. క్రిష్ గతంలో మహేష్‌బాబుతో ఓ సినిమా చేయడానికి ప్రయత్నం చేశారు. ‘శివం’ పేరుతో ఒక స్క్రిప్టు తయారు చేసు కొని ఆయన మహేష్‌ను కలిశాడని అన్నా రు. కానీ ఎందుకో అది వర్కవుట్ కాలేదు. క్రిష్ టాలెంట్ మీద ఎవరికీ సందేహాలు లేవు. ఆయన ఎంచుకునే సబ్జెక్టులు క్లాసీగా ఉంటాయి. హిస్టారికల్ సినిమాలు తీయడం లో ఆయన ఎక్స్‌పర్ట్. కానీ సూపర్‌స్టార్ మహేష్‌బాబు క్రేజ్‌కు అనుగుణంగా కమర్షియాలిటీ ఉన్న స్క్రిప్ట్‌ను క్రిష్ తయారుచేయగలడా అని అంటున్నారు.

Comments

comments