Home వార్తలు మహేష్‌బాబు నైట్ ఫైట్స్

మహేష్‌బాబు నైట్ ఫైట్స్

maheshఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తర్వాత మహేష్‌బాబు ఎ.ఆర్.మురుగదాస్ డైరెక్ష న్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. కొద్ది రోజుల కిత్రం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుం టున్న ఈ థ్రిల్లర్ మూవీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లోని అన్న పూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపు కుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈనెల 13 వరకు కొనసాగనుంది. ప్రస్తు తం ఫైట్ సీన్లను రాత్రివేళల్లో తెరకె క్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్ అనల్ అరుసు సారధ్యంలో మహేష్‌బాబుపై ఈ పోరాట సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. రాత్రి 8 గంటలకు షూటింగ్ ప్రారంభించి తెల్ల వారుజామున నాలుగు గంటలవరకు షూ టింగ్ జరుగుతోందని సమాచారం. హైద రాబాద్‌లో షూటింగ్ పూర్తయిన తర్వాత చెన్నైలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ట్ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్ తొలిసారిగా మహేష్‌బాబుకు జంటగా నటిస్తోంది ఈ చిత్రంలో. ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తుండగా నదియా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసి వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు ఫిల్మ్‌మేకర్స్. ఇక మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారని సమాచారం.