Home స్పెషల్ ఆర్టికల్స్ క్రిస్ గెతిన్ జిమ్స్

క్రిస్ గెతిన్ జిమ్స్

నాజుకైన శరీరం కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాం. సినిమాల్లో నచ్చిన హీరో స్లిమ్‌గా అందంగా ఉన్నాడంటే చాలు…ఆ హీరోను అనుసరిస్తూ నిజ జీవితంలో అనేక కసరత్తులు చేస్తుంటాం. ఆరోగ్యకరంగా ఉండేందుకు ఫిట్‌నెస్ జిమ్ బాట పడుతున్నారు చాలా మంది. ఫిట్‌నెస్సే మంత్రంగా నాజుకైనా శరీర రూపానికి శ్రీకారం చుడుతూ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది కొత్తపేట్‌లోని
“ క్రిస్ గెతిన్ జిమ్స్‌”.

Gym

టాలీవుడ్ రాకుమారుడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్‌బాబు అందంగా కనిపించేందుకు ఆయన చేత కసరత్తులు చేయిస్తూ…తెర వెనుక హీరోగా పేరు, ప్రఖ్యాతలు సొంతం చేసుకుంటున్నారు జిమ్ నిర్వాహకులు సతీష్ పర్యాద, రామ్, రవీంద్రారెడ్డిలు. మహేష్‌బాబు మా త్రమే కాదు ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌తో పాటు జూనియర్ ఎన్‌టిఆర్, విక్రమ్ కూడా జిమ్ కోచ్ సతీష్ పర్యాద వద్ద శిక్షణ తీసుకుంటున్న వారే. వీరితో పాటు ప్రముఖ క్రికెటర్ ప్రజ్ఙాన్ ఓజా, మాజీ టీంఇండియా క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్, సానియామిర్జా, గుత్త్తజ్వాల వంటి స్టార్ క్రీడాకారుల శరీర అందానికి కేరాఫ్ అడ్రస్ క్రిస్ గెతిన్ జిమ్స్.

ఇవి ప్రాముఖ్యం…

జిమ్, ఫిట్‌నెస్ చేసే సమయంలో స్ట్రెంత్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్, కార్డియో కసరత్తులు చాలా ప్రాముఖ్యం. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు, మజిల్స్ బలంగా ఉంటాయి. దీనిని 18 నుంచి 45వరకు వయస్సు కలిగిన వారు చేస్తే ఆరోగ్యకరంగా ఉంటారు. క్రాస్ ఫిట్ కోసం, సర్కూట్ ట్రైనింగ్, ఒలంపిక్ బాడీ కోసం ఫంక్షనల్ ట్రైనింగ్ ఫిట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చేయడానికి వయస్సు అక్కర్లేదు. ఇక రక్తప్రసరణ సజావుగా సాగుతూ, గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేసేందుకు కార్డియో ఉపయోగపడుతుంది. దీనిని కార్డియో మిషన్స్ ద్వారా చేయిస్తారు. ఇది వృద్ధ్దులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

 తగిన మోతాదులో ఆహారం తీసుకోవాలి 

జిమ్, ఫిట్‌సెస్ సమయంలో ఆహారం కూడా తగిన మోతాదులో తీసుకోకపోతే అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. ఫిట్‌నెస్ చేసే వారు ప్రధానంగా మూడు మైక్రో గ్రూప్స్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బొహైట్రేట్స్‌ని తగినంతగా తీసుకోవాలి. ప్రోటీన్ ఉండే ఆహారాన్ని మజిల్స్‌ను బిల్ చేసి రిపేర్ చేస్తుంది. ఫ్యాట్స్ ఉన్న ఆహారం ఆర్గానిక్స్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎండోక్రైం సిస్టంను రెగ్యులేట్ చేస్తుంది.

అంచలంచెలుగా ఎదుగుతూ.. ఈ నెల 19న రెండవ వార్షికోత్సవం
క్రిస్ గెతిన్ జిమ్ నిర్వాహకులు : రామ్

గత సంవత్సరం జులై 19న ప్రముఖ తెలుగు సినీనటుడు హీరో మహేష్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ చేతుల మీదుగా క్రిస్ గెతిన్ జి మ్‌ను ప్రారంభించాం. గత ఏడాది నుంచి ఎంతో మందికి తమ సేవలను అందించామన్నారు. నాజుకు కోసం క్రిస్ గెతిన్ జీమ్స్‌కు పరుగులు తీస్తున్నారు. కష్టమర్ల అభిరుచికి తగ్గట్లు శరీర ఆకృతిని తీర్చిదిద్దుతున్నాం.  నాణ్యమైన సేవలను అందిస్తు ఈనెల 19న రెండవ వార్షికోత్సవంలోకి అడుగుపెడుతున్నది. గ్రేటర్ హైద్రాబాద్‌లోనే అతి పెద్ద జిమ్‌గా పేరుగాంచిన క్రిస్ గెతిన్ జిమ్ అంచెలంచలుగా అభిమానుల ఆదరణతో ముందు కు వెళ్లుతుంది. అందులో భాగంగానే ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ నటులు తమన్నా, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, విక్రమ్, స్టార్ క్రీడాకారులు ప్రజ్ఙాన్ ఓజా, అజారుద్దిన్, గుత్తా జ్వాలా, సానియా మీర్జాలు, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్‌తో పాటు ఇతర ప్రముఖులు హాజరౌతున్నారని ఆయన తెలిపారు.

క్రిస్ జెతిన్ జిమ్స్ ప్రత్యేకతలు…

సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వ్యాయామ పరికరాలు…ఆధునిక హంగులతో వ్యాయామశాల..నిష్ణాతులైన కోచ్‌లతో సంపూర్ణ శిక్షణ
యువతకే కాకుండా వయో వృద్ధ్దులు, గృహణిలపై ప్రత్యేక శ్రద్ధ
ప్రపంచ స్థాయి హంగులతో కూడిన ఫిట్‌నెస్ సెంటర్ ఆసియాలోనే అతిపెద్ద జిమ్ సెంటర్
ప్రపంచస్థాయి ఎక్విప్‌మెంట్, ఆరోగ్యవంతమైన పరిసరాలు
వయస్సు తగ్గట్టు శరీర బరువును సరిచూడటం
స్ట్రీమ్ రూమ్ ( ఆవిరి గది)
జుంబా సర్కిట్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్, గ్రూప్ క్లాసెస్ తదితర ప్రత్యేకతలున్నాయి.

రాకుమారుడు మెచ్చిన ట్రైనర్
(సతీష్ పర్యాద, నిర్వాహకులు, క్రిస్ గెతిన్ జిమ్ కోచ్)

నగరానికి చెందిన సతీష్ పర్యాద లండన్‌లో బిటెక్ పూర్తి చేసి అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. స్వదేశంపై మమకారంతో తిరిగి ఇక్కడకు వచ్చారు. జిమ్‌లో అనేక కసరత్తులు చేసి మంచి బాడీని సొంతం చేసుకు న్నారు. ఇదే తరుణంలో కొత్తపేట్‌లో “క్రిస్ గెతిన్ జిమ్‌” అ నే పేరుతో మరో బ్రాంచిని ప్రారంభించారు. ప్రముఖులకు ఫిట్‌నెస్ కోచ్‌గా వ్యవహరిస్తునారు, టాలీవుడ్ ప్రిన్స్ మహే ష్‌బాబుకు మెచ్చిన ట్రైనర్ సతీష్ పర్యాద. చాలా మంది ప్రి న్స్ లాంటి సింపుల్‌గా ఉండే బాడీ కావాలంటూ జిమ్‌బాట పట్టె విధంగా చేశారు. షర్ట్ విప్పి కండలను టైట్ చేస్తే…తప్పా కండలు ఉన్నట్లు కనిపించకుండా మహేష్ అందంగా ఉండటానికి కారణం క్రిస్ జెతిన్ జిమ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

బాడీలో త్రీ షేప్స్‌తో …
రవీంద్రరెడ్డి ప్రముఖ సినీనటుడు, జిమ్ నిర్వాహకులు

జిమ్ బాడీలో ప్రధానంగా ఎక్టోమా ర్ఫ్, మెసోమార్ఫ్, ఎండో మార్ఫ్‌లు మూడు రకాలు ఉంటాయి.. సన్నగా, సింప్లీసిటీతో ఉంటూ, మజిల్స్ పెద్దగా కనిపించకుండా ఉండే ఆకారాన్ని ఎక్టోమార్ప్‌గా పరిగణిస్తారు. అథ్లెట్స్ లా కండలు తిరిగి గంభీరంగా ఉండే ఆకారాన్ని మెసోమార్ఫ్‌గా పిలుస్తారు. పెద్ద కండలు, బొద్దుగా, ప్యాంట్‌తో ఉండే ఆకారాన్ని ఎండో మార్ఫ్ కోడ్ చేస్తారు. ఈ ఆకారాల్లో నచ్చిన ఆకారం కలిగి ఉండాలంటే కనీసం రోజుకు ఓ గంటపాటు జిమ్ చేస్తే చాలు అంటున్నారు.